Jagan: జగన్ వేసుకున్న మరో సెల్ఫ్ గోల్ ఇది: చంద్రబాబు సెటైర్లు!

  • బీజేపీ నేతలకన్నా మోదీ భజనను అధికంగా చేస్తున్న జగన్
  • కియాను తానే తెచ్చానని మోదీయే చెప్పుకోలేదు
  • టీడీపీ విజయం కోసం పట్టుదలతో కృషి చేయాలి
కియా మోటార్స్ విషయంలో బీజేపీ, నరేంద్ర మోదీకి అనుకూలంగా మాట్లాడటం ద్వారా వైఎస్ జగన్ మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నారని చంద్రబాబునాయుడు సెటైర్లు వేశారు. జగన్ రోజుకో సెల్ఫ్ గోల్ వేసుకుని, ఓటమి దిశగా పరుగులు పెడుతున్నారని, టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకన్నా అధికంగా మోదీ గురించి జగన్ చేస్తున్న భజన పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. ఏపీకి కియా పరిశ్రమను తానే తెచ్చానని నరేంద్ర మోదీయే చెప్పుకోలేదని అన్నారు.

ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం నాయకులు మరింత పట్టుదలతో కృషి చేయాలన్నారు. ప్రతి నిమిషాన్నీ వినియోగించుకుంటూ, రోజువారీ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. భవిష్యత్తులో ఈవీఎం దొంగలుగా వైసీపీ నేతలు మారనున్నారని, వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కృషి చేసి, టీడీపీ అభ్యర్థుల విజయానికి పాటు పడేవారికి మంచి గుర్తింపునిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Jagan
Chandrababu
Narendra Modi

More Telugu News