KTR: కేంద్రంలో టాప్ పోస్ట్ కు కేసీఆర్: కేటీఆర్

  • బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం ఫెడరల్ ఫ్రంట్
  • 150కి పైగా సీట్లు రానున్నాయి
  • చేవెళ్ల ప్రచారంలో కేటీఆర్
లోక్ సభ ఎన్నికల తరువాత కేంద్రంలోని టాప్ పోస్ట్ కు కేసీఆర్ వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తాండూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, చేవెళ్ల నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న రంజిత్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్, "మేము చేస్తున్న ప్రయత్నం ఆ పోస్ట్ లక్ష్యంగా చేస్తున్నది కాదు. అది జరగొచ్చుకూడా. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ నిలిచే అవకాశాలు ఉన్నాయి" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు 150కి పైగా సీట్లు రానున్నాయని, బీజేపీ గెలిస్తే నరేంద్ర మోదీకి లాభిస్తుందని, కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ లాభం కలుగుతుందని అభిప్రాయపడ్డ ఆయన, టీఆర్ఎస్ గెలిస్తే, తెలంగాణకు లాభమని చెప్పారు.
KTR
KCR
Elections
Prime Minister

More Telugu News