YSRCP: ఎన్నికల తరువాత మూడో అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చాన్స్: వీడీపీ సర్వే!

  • అతిపెద్ద పార్టీగా బీజేపీ, రెండో స్థానంలో కాంగ్రెస్
  • బీజేపీకి 170 వరకూ, కాంగ్రెస్ కు 130 వరకూ చాన్స్
  • 25 నుంచి 30 సీట్ల కేటగిరీలో తృణమూల్, ఎస్పీతో పాటు వైసీపీ
లోక్ సభ ఎన్నికల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా సీట్లను పొందే పార్టీల్లో మూడో స్థానంలో నిలిచే అవకాశాలున్నాయని వీడీపీ అసోసియేట్స్ సర్వే పేర్కొంది. 170కి పైగా స్థానాల్లో సింగిల్ లార్జస్ట్ పార్టీగా బీజేపీ నిలుస్తుందని, 130 సీట్ల వరకూ పొందే కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటుందని వీడీపీ అంచనా వేసింది. ఇక, 25 నుంచి 30 సీట్ల వరకూ తెచ్చుకునే పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలున్నాయని పేర్కొంది. 15 నుంచి 20 సీట్లను పొందగలిగే పార్టీల్లో బీఎస్పీ, డీఎంకే, టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే, శివసేన పార్టీలున్నాయని వెల్లడించింది.
YSRCP
Election
BJP
Congress
VDP Associates

More Telugu News