SV Krishnareddy: జగన్ గురించి మాట్లాడకుంటే తప్పవుతుంది: దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి

  • జగన్ కు రాష్ట్ర ప్రజలంతా అండగా నిలబడాలి
  • తండ్రిలానే ఆలోచిస్తున్న జగన్
  • జగన్ సీఎం కావాలన్న కృష్ణారెడ్డి
వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి, ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు రాష్ట్ర ప్రజలంతా అండగా నిలబడాలని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కోరారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ గురించి చెప్పాలని అనిపించి తాను మీడియా ముందుకు వచ్చానని అన్నారు. ఆయన గురించి చెప్పకుంటే తప్పు చేసిన వాడిగా మిగులుతానన్న భావన కలిగిందని అన్నారు.

ప్రతి చిన్న విషయంపైనా ఆయనకు పూర్తి అవగాహన ఉందని చెప్పిన కృష్ణారెడ్డి, విద్య, ఉద్యోగం, వైద్యం, సంక్షేమం తదితర అంశాల గురించి ఆలోచించే జగన్ సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఆయనకు ఉందని, జగన్ చేస్తున్న ప్రతి పనీ తన మనసులో నాటుకుందని ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. తన తండ్రి ఎలా ఆలోచించేవారో, జగన్ కూడా అలానే ఆలోచిస్తున్నారని, ప్రజల మేలుకోరే ఇటువంటి నాయకుడు అధికారంలోకి రావడం అవసరమని అభిప్రాయపడ్డారు. 
SV Krishnareddy
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News