Andhra Pradesh: మూడున్నర ఎకరాలు ఉన్న చింతమనేని వేల కోట్లు ఎలా సంపాదించాడు?: వైసీపీ నేత అబ్బయ్య చౌదరి

  • మట్టి నుంచి ఇసుక వరకూ అన్ని దోచేశారు
  • బినామీల పేర్లతో భారీగా ఆస్తులు కొన్నారు
  • దెందులూరు ప్రజలకు రాక్షసపాలన చూపిస్తున్నారు
గత ఐదేళ్లుగా దెందులూరును టీడీపీ నేత, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దోచుకున్నారని వైసీపీ నేత కొఠారు అబ్బయ్య చౌదరి ఆరోపించారు. మట్టి నుంచి ఇసుక వరకూ అన్నింటిలో చింతమనేని దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. మూడున్నర ఎకరాలు ఉన్న చింతమనేని వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో అబ్బయ్య చౌదరి మాట్లాడారు.

విశాఖపట్నం నుంచి ఢిల్లీ వరకూ తన బినామీల పేర్లతో చింతమేనని ప్రభాకర్ భారీగా ఆస్తులు కొన్నారని ఆరోపించారు. దెందులూరు ప్రజలకు గత ఐదేళ్లుగా రాక్షసపాలన చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో చింతమనేనికి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం తథ్యమని జోస్యం చెప్పారు. వైసీపీ తరఫున అబ్బయ్య చౌదరి దెందులూరు నుంచి పోటీ చేస్తున్నారు.
Andhra Pradesh
Telugudesam
YSRCP
Chinthamaneni Prabhakar
abbayya chowdary
denduluru

More Telugu News