వేగంగా వెళుతూ లోయలోకి పల్టీకొట్టిన వాహనం.. ఆరుగురు దుర్మరణం!
- జమ్మూకశ్మీర్ లోని రాజౌరీలో ఘటన
- అదుపుతప్పి లోయలోకి జారిపోయిన వాహనం
- ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి పరిస్థితి విషమం
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు బాధితులను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.