సార్...మీరు జరిమానా చెల్లించాలి : తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి పోలీసుల షాక్
- ప్రచారంలో భాగంగా వెళ్తుండగా ప్రస్తావన
- పాత బకాయిలు ఉన్నాయని చలానాల ప్రదర్శన
- డబ్బు చెల్లించి వెళ్లిన రేవంత్
ఆ సమయానికి అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు రేవంత్ వెళ్తున్న కారు నంబర్‌పై ఉన్న జరిమానా చలానాలను పరిశీలించారు. సైదాబాద్, రాజేంద్రనగర్‌లలో అతివేగం, తప్పుడు పార్కింగ్ చేసినందుకు సదరు కారు నంబర్‌పై రూ.5 వేల జరిమానా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కారు వద్దకు వెళ్లి విషయం రేవంత్‌రెడ్డికి చెప్పగా తొలుత ఆశ్చర్యపోయినా, అనంతరం డబ్బు చెల్లించి ఆయన వెళ్లిపోయారు.