తెనాలి అభివృద్ధికి ఐదేళ్లలో రూ.960 కోట్లు ఖర్చుపెట్టాను!: టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్
- 1,051 మందికి చంద్రన్న బీమా కల్పించాం
- 20 వేల మంది రైతులకు రుణమాఫీ చేశాం
- తెనాలిలో మీడియా సమావేశం ఏర్పాటుచేసిన ఆలపాటి
తెనాలిలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటుచేసిన రాజేంద్రప్రసాద్.. తాను చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 826 మంది ప్రజలను ఆదుకున్నామనీ, వీరికి రూ.5.75 కోట్ల లబ్ధి చేకూర్చామని తెలిపారు. నియోజకవర్గంలో 56,000 మందికి పసుపు-కుంకుమ పథకం కింద నగదును అందజేశామనీ, దాదాపు 29,000 మందికి పింఛన్లు ఇస్తున్నామని ఆలపాటి రాజేంద్రప్రసాద్ చెప్పారు. తెనాలిలో రూ.122.86 కోట్లతో 20,000 మంది రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటున్న తనకు మళ్లీ ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.