Banks: రేపు పనిచేసి ఎల్లుండి మూతపడనున్న బ్యాంకులు

  • రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం
  • యాన్యువల్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ పనుల్లో బ్యాంకులు బిజీ
  • వాణిజ్య, సహకార బ్యాంకులు సోమవారం మూత
రేపటితో ఈ ఆర్థిక సంవత్సరం (2018-19) ముగియనుండడంతో ఖాతాల క్లోజింగ్ (యాన్యువల్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్) పనుల్లో బ్యాంకు సిబ్బంది బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వాణిజ్య, సహకార బ్యాంకులు పనిచేయవని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తెలిపింది. అయితే, ఆదివారం మాత్రం ప్రభుత్వానికి రావాల్సిన వసూళ్లు, చెల్లింపుల లావాదేవీల నిర్వహణ కోసం సంబంధిత ప్రత్యేక బ్రాంచ్‌లు పనిచేస్తాయని పేర్కొంది. పే అండ్ అకౌంట్స్ బ్రాంచీలన్నీ మార్చి 31న పనిచేయాలని కేంద్రం సూచించిందని పేర్కొన్న ఆర్బీఐ.. ఆర్టీజీఎస్, నిఫ్ట్ వంటి డిజిటల్ లావాదేవీల సమయాలను అందుకు అనుగుణంగా పొడిగించినట్టు తెలిపింది.
Banks
RBI
Bussiness
Financial year

More Telugu News