Keerti Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'అదో కిక్' అంటున్న కీర్తి సురేశ్ 
  • 'మజిలీ' వేడుకకు ప్రముఖ నటులు 
  • కల్యాణ్ రామ్ డ్యూయల్ రోల్   
*  సినిమా తారనైనా కూడా నేను ఇప్పటికీ జనం మధ్య మామూలుగానే తిరుగుతుంటాను.. అంటోంది అందాల నాయిక కీర్తి సురేశ్ . 'అవును, స్టార్ గా ఒక ఇమేజ్ వచ్చాక ఎక్కడికి వెళ్లినా జనం ఎగబడతారు. దాంతో కాస్త ఇబ్బంది వుంటుంది. అలాగని చెప్పి నేను నా సరదాలు తీర్చుకోవడం మానను. ఇప్పటికీ నా షాపింగ్ నేనే చేసుకుంటాను. ఆర్టిస్టుని కాకముందు ఎలా అయితే తిరిగే దానినో అలాగే తిరుగుతున్నాను. జనం వచ్చి మాట్లాడుతుంటారు. అదో కిక్' అని చెప్పింది.
*  చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'మజిలీ' చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. ఈలోగా రేపు (ఆదివారం) సాయంకాలం హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. దీనికి నాగార్జున, వెంకటేశ్ అతిథులుగా హాజరవుతారు.
*  '118' హిట్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ తన తదుపరి చిత్రాన్ని వేణు మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నాడు. 'తుగ్లక్' పేరుతో రూపొందే ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేస్తాడట. 
Keerti Suresh
samantha
chaitanya
Nagarjuna
Venkatesh

More Telugu News