Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిందీ రీమేక్ దిశగా 'ఎఫ్ 2'

  • తెలుగులో హిట్ కొట్టిన 'ఎఫ్ 2'
  • హిందీ రీమేక్ పై దృష్టి పెట్టిన దిల్ రాజు
  •  మరో నిర్మాతగా బోనీ కపూర్
తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్ 2' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తంగా 80 కోట్ల షేర్ ను రాబట్టింది. పెళ్లికిముందు .. పెళ్లి తరువాత జీవితం ఎలా వుంటుందనే కామెడీ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా, వెంకటేశ్ - వరుణ్ తేజ్ లకు భారీ విజయాన్ని అందించింది.

తెలుగులో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు, హిందీలో రీమేక్ చేయడానికి రంగంలోకి దిగారు. హిందీలో బోనీకపూర్ తో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడిగా అనీస్ బజ్మీని తీసుకున్నారు. ఈ సినిమాకి పనిచేయనున్న సాంకేతిక నిపుణుల గురించి .. నటీనటులను గురించి త్వరలోనే తెలియనుంది.
dil raju
boney kapoor

More Telugu News