Mahesh Babu: 'మహర్షి' నుంచి ఫస్టు లిరికల్ సాంగ్ .. అదరగొట్టేసిన దేవిశ్రీ

  • హుషారైన దేవిశ్రీ బీట్ 
  • ఆకట్టుకుంటోన్న శ్రీమణి సాహిత్యం 
  • యూత్ కి కనెక్ట్ అయ్యే స్నేహగీతం      
వంశీ పైడిపల్లి, మహేశ్ బాబు కాంబినేషన్లో 'మహర్షి' రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను మే 9వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా చెప్పినట్టుగానే తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను వదిలారు. 'చోటి .. చోటి .. ' అంటూ ఈ సాంగ్ సాగుతోంది. కాలేజ్ నేపథ్యంలో .. స్నేహంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ .. మహేశ్ - పూజా హెగ్డే .. అల్లరి నరేశ్ తదితరులపై ఈ పాట సాగుతుందనిపిస్తోంది.

'స్నేహం అంటే పుస్తకాలు చెప్పని పాఠం .. కన్నవాళ్లు ఇవ్వలేని ఆస్తి' అంటూ శ్రీమణి రాసిన సాహిత్యం బాగుంది. ఈ పాటకు దేవిశ్రీ కట్టిన బాణీ .. ఆయన ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవిశ్రీ అదరగొట్టేశాడు. చాలా రోజుల తరువాత కాలేజ్ స్టూడెంట్స్ కి సరదాగా .. సంతోషంగా .. సందడిగా సాగిపోయే ఒక మంచి పాట దొరికిందనే చెప్పుకోవాలి. 'మహర్షి' నుంచి వచ్చిన ఈ ఫస్టు లిరికల్ సాంగ్ మంచి మార్కులు కొట్టేసిందనే చెప్పాలి.
Mahesh Babu
pooja hegde
allari naresh

More Telugu News