allu arjun: 'మిడిల్ క్లాస్ అబ్బాయి' దర్శకుడితో అల్లు అర్జున్

  • త్రివిక్రమ్ తో సెట్స్ పైకి బన్నీ 
  • తదుపరి సినిమా సుకుమార్ తో 
  • లైన్లోకి వచ్చిన వేణు శ్రీరామ్    
తన సినిమా నుంచి అభిమానులు ఏ అంశాలను ఆశిస్తారు? వాళ్లతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడం ఎలా? అనే విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక దృష్టి పెడతాడు. అందువల్లనే కథాకథనాల విషయంలో అంతా ఓకే అనుకున్నాకే ఆయన సెట్లో అడుగుపెడతాడు. ఆయన తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా వుండనుంది. ఈ ప్రాజెక్టు తరువాత ఆయన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 'మిడిల్ క్లాస్ అబ్బాయి'తో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న వేణు శ్రీరామ్, ఏడాది పాటు ఈ కథపై కసరత్తు చేసి అల్లు అర్జున్ కి వినిపించాడట. ఆయనకి ఈ కథ బాగా నచ్చడంతో, పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పినట్టుగా సమాచారం. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తాడట. 
allu arjun
trivikram
sukumar

More Telugu News