jagan: జగన్ లా దొడ్డదారిన పోయి మోదీ కాళ్లు పట్టుకోను: పవన్ కల్యాణ్

  • కేవలం రెండు కుటుంబాలే రాజకీయాలు చేయాలా?
  • వైసీపీని ఎదుర్కోవడానికి జనసేనే కరెక్ట్ పార్టీ
  • టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే బహిరంగంగానే పెట్టుకుంటా
ఏపీలో కేవలం రెండు కుటుంబాలు మాత్రమే రాజకీయాలు చేయాలా? సామాన్యులకు రాజకీయం అవసరం లేదా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. శాసనసభ గడప కూడా తొక్కని నాయకుడు మనకు అవసరమా? అని అడిగారు.

చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు, జగన్ లను సైతం మన పార్టీకే ఓటు వేయాలని అడుగుతున్నానని చెప్పారు. వైసీపీ అంటే టీడీపీకి భయమని... వైసీపీని ఎదుర్కోవడానికి జనసేనే కరెక్ట్ పార్టీ అని అన్నారు. సైకిల్ పాతబడిపోయిందని... ఫ్యాన్ తిరగాలంటే పవర్ మనం ఇవ్వాలని ఎద్దేవా చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే బహిరంగంగానే పెట్టుకుంటానని చెప్పారు. జగన్ మాదిరి దొడ్డిదారిన వెళ్లి ప్రధాని మోదీ కాళ్లను తాను పట్టుకోనని అన్నారు.
jagan
pawan kalyan
chandrababu
ysrcp
janasena
Telugudesam
modi
bjp

More Telugu News