Nizamabad: నామినేషన్ల ఉపసంహరణకు రేపే ఆఖరు కావడంతో నిజామాబాద్‌పై తీవ్ర ఉత్కంఠ

  • అధిక మొత్తంలో నామినేషన్లు
  • ఒక్క నామినేషన్‌ను కూడా ఉపసంహరించుకోలేదు
  • బరిలో నిలిచిన 180 మంది రైతులు
పసుపు, ఎర్రజొన్న రైతుల వ్యవహారంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిజామాబాద్ రైతులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే నామినేషన్ల ఉపసంహరణకు రేపే ఆఖరి రోజు కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటి వరకూ ఒక్కరు కూడా నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోవడం విశేషం. దీంతో రేపు ఎంత మంది నామినేషన్లు ఉపసంహరించుకుంటారో.. ఎందరు బరిలో నిలుస్తారో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. నిజామాబాద్ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు 180 మంది రైతులు నామినేషన్ దాఖలు చేశారు.
Nizamabad
Nominations
Formers
Last Date

More Telugu News