Johny Master: ఛీటింగ్ కేసులో జానీ మాస్టర్‌కు జైలు శిక్ష

  • స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ
  • చెక్‌ బౌన్స్‌తో పాటు మరికొన్ని కేసులు
  • 6 నెలల జైలు శిక్ష విధించిన మేడ్చల్ కోర్టు
తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖ కొరియోగ్రాఫర్స్‌లో జానీ మాస్టర్ ఒకరు. తన స్టైల్‌తో ఆకట్టుకున్న జానీ మాస్టర్ స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేశారు. అనతి కాలంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా పేరు సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం జైలుకు వెళ్లనున్నారు. 2015లో చెక్ బౌన్స్ కేసుతో పాటు మరికొన్ని కేసులు ఆయనపై నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో ఆయనపై సెక్షన్ 324, 354, 506 కింద కేసు నమోదైంది. తాజాగా ఆ కేసులో తుది తీర్పు వచ్చింది. సెక్షన్ 354 కేసుని మాత్రం కొట్టివేసిన కోర్టు 324, 506 సెక్షన్ల కింద నమోదైన కేసులలో ఆయనను మేడ్చల్ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో జానీ మాస్టర్‌తో పాటు మరో ఐదుగురికి 6 నెలల జైలు శిక్షను విధించింది.
Johny Master
Chorecographer
Check Bouns
Medchal Court

More Telugu News