KCR: కేసీఆర్ అంటే కిలాడి చంద్రశేఖర్‌రావు: జీవీఎల్ ధ్వజం

  • కేంద్రం సహకారంతోనే అభివృద్ధి
  • చచ్చు రాజకీయాలు మానుకోవాలి
  • లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు
కేసీఆర్ అంటే కిలాడి చంద్రశేఖర్ రావు అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. నేడు ఆయన పెద్దపల్లిలో మాట్లాడుతూ, కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, ఇకపై చచ్చు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ తెలంగాణలో నైజాం పాలన కొనసాగిస్తున్నారని జీవీఎల్ విమర్శించారు. మతతత్వ పార్టీ ఎంఐఎంతో కలసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని.. అసలు ఇప్పటి వరకూ టీఆర్ఎస్ ఏం సాధించిందో చెప్పాలని జీవీఎల్ నిలదీశారు.
KCR
GVL Narasimharao
Telangana
TRS
BJP

More Telugu News