Jagan: వైఎస్ జగన్ కు ముద్దుపెట్టిన పీవీపీ... వైరల్ అవుతున్న వీడియో!

  • తిరువూరులో వైసీపీ ప్రచారం
  • జగన్ కు ఆప్యాయంగా ముద్దు పెట్టిన పీవీపీ
  • వైరల్ అవుతున్న వీడియో
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు మరో 13 రోజుల గడువు మాత్రమే ఉంది. అన్ని రాజకీయ పార్టీలూ తమ ప్రచార వేగాన్ని పెంచాయి. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీల నేతలు 175 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో తిరువూరులో వైసీపీ ప్రచారంలో జగన్ ఉన్న వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. విజయవాడ నుంచి వైసీపీ తరఫున లోక్ సభ అభ్యర్థిగా బరిలో నిలబడిన పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) వేలాది మంది చూస్తుండగా, తమ అధినేత వైఎస్ జగన్ ను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ముద్దుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూడవచ్చు.
Jagan
PVP
Vijayawada
Tiruvuru

More Telugu News