rajani: రజనీ, మురుగదాస్ మూవీ ఆలస్యం కావడానికి అదే కారణమట

  • రజనీతో ప్లాన్ చేసిన మురుగదాస్ 
  • ఈ నెలలో పట్టాలెక్కవలసిన ప్రాజెక్టు
  •  ఎన్నికల కారణంగానే ఆలస్యం      
ఈ మధ్య కాలంలో రజనీకాంత్ పెద్ద గ్యాపు లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. అదే ఊపుతో మురుగదాస్ మూవీని కూడా పట్టాలెక్కించాలని అనుకున్నారు. కానీ ఈ నెలలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు .. వచ్చేనెలలో 10వ తేదీ తరువాత ఈ సినిమా షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణం, ఎన్నికల ఎఫెక్ట్ అని అర్థమవుతోంది.

ఎన్నికల సమయం కావడంతో బ్యాంకుల నుంచి పెద్ద మొత్తాల్లో డ్రా చేసే నగదుపై పోలీస్ వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎక్కడ పెద్ద మొత్తంలో డబ్బు లభించినా వెంటనే సీజ్ చేసేస్తున్నారు. రజనీ సినిమా భారీ బడ్జెట్ తో కూడుకున్నది కావడం వలన, పెద్దమొత్తంలోనే డబ్బు అవసరమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగానే వచ్చే నెలలో ఈ సినిమాను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికలుగా నయనతార - కీర్తి సురేశ్ పేర్లు వినిపిస్తున్నాయి.
rajani
nayanatara
keerthi suresh

More Telugu News