వైసీపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ
- టీడీపీ హయాంలో పేదలకు తీరని అన్యాయం జరుగుతోంది
- ప్రభుత్వ పథకాలు ఆ పార్టీ కార్యకర్తలకే పరిమితమయ్యాయి
- జగన్ సీఎం కావడం ఖాయం
పార్టీ సహాయకార్యదర్శి కరణం సరస్వతి, అధికార ప్రతినిధి మందా భూషణంలతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని, ప్రభుత్వ పథకాలు కేవలం పార్టీ కార్యకర్తలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జగన్ గాలి వీస్తోందని, ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. మొత్తం 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ కనీసం 15 స్థానాల్లో గెలుపొందుతుందని, కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.