sai pallavi: సాయిపల్లవి ప్రేమలో పడిందంటూ కోలీవుడ్ టాక్

  • సహజనటిగా సాయిపల్లవికి పేరు
  • అమలాపాల్ నుంచి విడిపోయిన ఏఎల్ విజయ్
  •  పుకారు మాత్రమేనని చెబుతోన్న ఫ్యాన్స్  
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా సాయిపల్లవికి మంచి క్రేజ్ వుంది. సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుందనే టాక్ వుంది. పాత్ర తరువాతనే పారితోషికం గురించి ఆలోచించే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి సాయిపల్లవి ఒక దర్శకుడితో ప్రేమలో పడిందనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు .. అమలా పాల్ మాజీ భర్త ఏ.ఎల్.విజయ్.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'కణం' సినిమా తెరకెక్కింది. తమిళ .. తెలుగు భాషల్లో ఒక వైవిధ్యభరితమైన చిత్రంగా ఇది మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా షూటింగు సమయంలో నుంచే ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందనీ .. ఇప్పుడు బలపడిందని చెప్పుకుంటున్నారు. పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అయితే సాయిపల్లవి అభిమానులు మాత్రం ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. 'అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు' అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి చెప్పిన మాటలను గుర్తుచేస్తున్నారు.
sai pallavi
al vijay

More Telugu News