renu desai: అకీరా, ఆధ్యా, కాబోయే భర్తతో కలసి బాలి వెళ్లిన రేణు దేశాయ్.. ఫొటోలు చూడండి

  • బాలిలో సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న రేణు
  • ఆధ్యాతో కలసి తన కాబోయే భర్త డ్యాన్స్ చేస్తున్న వీడియో అప్ లోడ్
  • కాబోయే భర్త ముఖాన్ని నేరుగా చూపించని వైనం
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తన పిల్లలు అకీరా, ఆధ్యాలతో పాటు తనకు కాబోయే భర్తతో కలసి సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇండొనేషియాలోని బాలిలో సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో రేణు దేశాయ్ పంచుకున్నారు. ఆధ్యాతో కలసి తన కాబోయే భర్త డ్యాన్స్ చేస్తున్న వీడియోను కూడా అప్ లోడ్ చేశారు. అయితే, ఇప్పుడు కూడా తన కాబోయే భర్త ముఖాన్ని ఆమె నేరుగా చూపించకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఆయనకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని రేణు వెల్లడించని సంగతి తెలిసిందే.
renu desai
husband
tollywood

More Telugu News