Samanta: 'మీకు ప్రశాంతత కలుగుగాక'... రాధా రవిని టార్గెట్ చేసిన సమంత!

  • నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధారవి
  • క్షమాపణలు చెప్పినా సద్దుమణగని వివాదం
  • ట్విట్టర్ లో రాధా రవిపై స్పందించిన సమంత
దక్షిణాది టాప్ హీరోయిన్లలో ఒకరైన నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసి కష్టాలు కొని తెచ్చుకున్న తమిళ సీనియర్ నటుడు రాధా రవి, క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమణగలేదు. తాజాగా నటి సమంత సైతం ఆయన్ను టార్గెట్ చేసింది. తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, "రాధా రవీ... మీ కష్టం ఎప్పటికీ అలాగే నిలిచివుంటుంది. మీరిప్పుడు బాధలో ఉన్నారు. దాన్ని చూసి మేమూ బాధపడుతున్నాం. మీ ఆత్మ లేదా ఏం మిగిలుంటే దానికి శాంతి, ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తున్నా. నయనతార తరువాతి సూపర్ హిట్ సినిమాకు మీకు టికెట్లు పంపిస్తా. పాప్ కార్న్ తింటూ ఆనందించండి" అని వ్యాఖ్యానించింది.



Samanta
Nayanatara
Radharavi
Twitter

More Telugu News