Mohanbabu: వైసీపీలో చేరనున్న మోహన్ బాబు... లోటస్ పాండ్ కు వచ్చి జగన్ తో చర్చలు!

  • జగన్ తో ప్రత్యేకంగా సమావేశమైన మోహన్ బాబు
  • రాజ్యసభకు పంపాలని భావిస్తున్న జగన్
  • మరికాసేపట్లో వైసీపీ కండువా!
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వచ్చిన ఆయన, జగన్ తో చర్చలు జరిపారు. ఇటీవలి కాలంలో కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పై మోహన్ బాబు నిరసనలకు దిగి, చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబుకు రాజ్యసభ సీటు ఇచ్చి, పార్లమెంట్ కు పంపాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో మోహన్ బాబు అధికారికంగా వైసీపీ కండువాను కప్పుకోనున్నారని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.
Mohanbabu
YSRCP
Jagan
Lotuspond

More Telugu News