Chandrababu: వివేకా హత్యపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

  • వివేకా హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఫిర్యాదు
  • చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • కనకమేడల ఆధ్వర్యంలో సీఈసీని కలిసిన బృందం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును రాజకీయం చేస్తూ ఎన్నికల్లో లబ్ధిపొందాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, వివేకా హత్యపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోమవారం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రతో కూడిన కమిషన్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, వర్ల రామయ్య తదితరులు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. వివేకా హత్యపై దర్యాప్తునకు ‘సిట్’ ఏర్పాటు చేసినప్పటికీ పోలీసులపై తమకు నమ్మకం లేదని పదేపదే ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Chandrababu
YS Vivekananda reddy
YSRCP
YS Jagan
CEC
Telugudesam

More Telugu News