kajal: 'సీత' విడుదల తేదీ వాయిదా పడే అవకాశం?

  • 'సీత'గా కనిపించనున్న కాజల్
  • ప్రతినాయకుడిగా సోనూ సూద్ 
  • సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్      
గ్లామరస్ పాత్రలతోనే యూత్ హృదయాలను కొల్లగొట్టేస్తూ వస్తోన్న కాజల్, ఇక నయనతార .. అనుష్క .. త్రిష బాటలో నడవడానికి సిద్ధమైపోయినట్టుగా కనిపిస్తోంది. నాయిక ప్రాధాన్యత గల పాత్రలను చేయడానికి రంగంలోకి దిగిపోయింది. తేజ దర్శకత్వంలో 'సీత' అనే సినిమాను చేసింది. కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ఈ సినిమా, విడుదలకి ముస్తాబవుతోంది.

విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాను, ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం సందేహమే అనే మాట ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. కొన్ని కారణాల వలన విడుదల తేదీని వాయిదా వేసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి వుంది. విలన్ గా సోనూ సూద్ నటించిన ఈ సినిమాకి, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు.
kajal
bellamkonda srinivas

More Telugu News