Andhra Pradesh: ఇలా మాట్లాడడానికి జగన్ కు సిగ్గుండాలి: కుటుంబరావు ఆగ్రహం

  • కేసీఆర్ తో కుమ్మక్కైనట్లు జగనే ఒప్పుకున్నారు
  • జగన్ కు ఎన్ని కోట్లిచ్చారో త్వరలోనే బయటపెడతాం
  • మనీలాండరింగ్, హవాలో జగన్ సిద్ధహస్తుడు
తెలంగాణ సీఎం కేసీఆర్ తో కుమ్మక్కై ఏపీని దెబ్బతీసేందుకు పక్కా కుట్ర చేశారన్న విషయాన్ని జగనే స్వయంగా ఒప్పుకున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చారా? లేక అంతకంటే ఎక్కువే ఇచ్చారా? అన్న విషయాన్ని త్వరలోనే బయటపెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా నోరుమెదపని జగన్, కేసీఆర్ తో కలిసి ‘హోదా’ సాధిస్తారా? అని ప్రశ్నించారు. మనీలాండరింగ్, హవాలో జగన్ సిద్ధహస్తుడని, దొంగసొమ్ము ఎలా వెనకేసుకోవాలో, ఎలా పంచాలో ఆయనకు బాగా తెలుసని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ధైర్యంతోనే వెయ్యి కోట్లు ఇస్తుంటే మీరు చూశారా? అని ఎదురు ప్రశ్నిస్తున్నాడని దుయ్యబట్టారు. జగన్ చెబుతున్న మాటలను ప్రజలు నమ్మరని, ఇలా మాట్లాడానికి ఆయనకు సిగ్గుండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh
Telangana
kutumbarao
jagan

More Telugu News