Pawan Kalyan: మనదేమన్నా కొబ్బరికాయల బిజినెస్సా! చంద్రబాబును సీఎం చేయడానికి కష్టపడుతున్నావు పవన్ కల్యాణ్?: నటుడు పృథ్వీ

  • ముందు చంద్రబాబు, లోకేష్ ల తొక్క తీయాలి
  • విపక్ష నేతను విమర్శించే అసమర్థుడు పవన్
  • ప్రజాక్షేత్రంలో ఉన్నావని మర్చిపోవద్దు
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులను హెచ్చరించడంపై సినీ నటుడు, వైసీపీ నేత పృథ్వీ ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో ఏ నాయకుడైనా ప్రజల పక్షం వహించి ప్రభుత్వాన్ని విమర్శిస్తారని, కానీ పవన్ మాత్రం విపక్ష నేతను టార్గెట్ చేసుకుని తన ఉద్దేశాన్ని చాటుకుంటున్నాడని విమర్శించారు. ఇలాంటి అసమర్థ నేత రాజకీయాల్లో ఎక్కడా ఉండడని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేయడానికి చాలా కష్టపడుతున్నాడని పృథ్వీ వ్యాఖ్యానించారు.

అయినా, తొక్కలు, తోళ్లు తీయడానికి మనదేమైనా కొబ్బరికాయల బిజినెస్సా! ప్రజల్లో ఉన్నామన్న సంగతి మర్చిపోతే ఎలా? అంటూ మండిపడ్డారు. ఒకవేళ పవన్ తాట తీయాలనుకుంటే రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్న చంద్రబాబు, లోకేష్ ల తాట తీయాలని సూచించారు. 2014లో టీడీపీని నెత్తినపెట్టుకుని మోసి ఓట్లు వేయించిన పవన్ ఈసారి కూడా ప్రజలను మోసం చేసి చంద్రబాబును మళ్లీ సీఏం చేసేందుకు శ్రమపడుతున్నాడని పృథ్వీ ఆరోపించారు. ఏప్రిల్ 11తో టీడీపీ, జనసేన పార్టీలను ప్రజలు భూస్థాపితం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Pawan Kalyan
YSRCP

More Telugu News