Ys: వైఎస్, చంద్రబాబు కుటుంబాలు తప్ప వేరే వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదా?: పవన్ కల్యాణ్

  • చంద్రబాబు, జగన్ కు ఒకటే చెబుతున్నా
  • ఆ రోజులు మారాయి 
  • కొత్త తరం, కొత్త రాజకీయం వచ్చాయి
వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు కుటుంబాలు తప్ప వేరే వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదా? రాజకీయం చేయకూడదా? అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా వేమూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో ‘ఆట’ చంద్రబాబు, జగన్ ల మధ్యే ఉండాలి తప్ప మూడో కుటుంబానికి స్థానం లేదా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు, జగన్ కు ఒకటే చెబుతున్నానని ఆ రోజులు మారాయని, కొత్త తరం, కొత్త రాజకీయం వచ్చాయని అన్నారు. సమాజాన్ని కులాల పేరిట విచ్ఛిన్నం చేసే వాళ్లం కాదని, సమాజాన్ని కలుపుతూ రాజకీయం చేస్తామని చెప్పారు. టికెట్లిస్తామని చెప్పి జగన్ లాగా గొడ్డుచాకిరి చేయించే వాళ్లం తాము కాదని, నవసమాజం కోసం పాటుపడేవాళ్లమని అన్నారు. 
Ys
Nara
Janasena
Pawan Kalyan
guntur

More Telugu News