YSRCP: పవన్ కల్యాణ్ ‌వాడుతున్న పదాలు మాకు నచ్చడంలేదు... ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ

  • ‌జగన్, విజయసాయిలపై నోరుపారేసుకుంటున్నారు
  • నియమావళికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు
  • మండిపడిన వైసీపీ నేత
వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇవాళ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన నాగిరెడ్డి జనసేన చీఫ్ ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. పవన్ కల్యాణ్ తమ పార్టీ అధ్యక్షుడు జగన్, ముఖ్యనేత విజయసాయిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు.

ఎన్నికల నియమావళిని కూడా పట్టించుకోకుండా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పవన్ కల్యాణ్ పై కఠినచర్యలు తీసుకోవాలంటూ నాగిరెడ్డి సీఈవోను కోరారు. పవన్ తన ప్రసంగాల్లో వాడుతున్న పదాలు తమకు అభ్యంతరకరంగా ఉన్నాయని నాగిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాకుండా, సామాజిక మాధ్యమంలో వైసీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కూడా తెలిపారు.
YSRCP
Pawan Kalyan
Jagan
Vijay Sai Reddy

More Telugu News