వైఎస్ జగన్ నా అన్న.. నా రక్తం!: విమర్శకులకు మంచు వెరోనికా కౌంటర్
- జగన్ కు సపోర్ట్ ఇవ్వడంపై కొందరు నెటిజన్ల విమర్శలు
- దీటుగా స్పందించిన వెరోనికా మంచు
- తనకు ఫ్యామిలీనే ముఖ్యమని వ్యాఖ్య
ఈరోజు ట్విట్టర్ లో వెరోనికా రెడ్డి స్పందిస్తూ..‘నేను వైఎస్ జగన్ ను ఎందుకు సమర్థిస్తున్నానని చాలామంది అడుగుతున్నారు. నేను ఎందుకు సపోర్ట్ చేయకూడదు? మీకు తెలియదేమో! జగన్ నా అన్న.. నా రక్తం. నామటుకు అన్నింటికంటే నా కుటుంబమే ముఖ్యం. #APneedsYSJagan #VoteForFan #APElections2019’ అని ట్వీట్ చేశారు.