యాసిడ్ దాడి బాధితురాలి బయోపిక్ గా 'ఛపాక్' .. దీపిక పదుకొనె ఫస్టులుక్ రిలీజ్
- బాలీవుడ్ నెంబర్ వన్ నాయికగా దీపిక
- తాజా చిత్రంగా 'ఛపాక్'
- వచ్చే ఏడాది జనవరి 10న విడుదల
మేఘన గుల్జార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి 'ఛపాక్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి దీపిక పదుకొనె ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. యాసిడ్ దాడి జరిగిన అనంతరం స్టిల్ ను ఫస్టులుక్ గా వదిలారు. గ్లామర్ క్వీన్ గా మార్కులు కొట్టేసిన దీపిక, 'ఛపాక్'లో ఈ తరహా లుక్ తో కనిపించడానికి సిద్ధపడటం సాహసమేనని చెప్పాలి. 2020 జనవరి 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా ఈ ఫస్టు పోస్టర్ ద్వారానే ప్రకటించారు.