Revanth Reddy: గుడ్‌ మార్నింగ్‌ వాకర్స్‌... ఉదయం పూట నడక సమయాన రేవంత్‌రెడ్డి ప్రచారం

  • మినీ ట్యాంక్‌ బండ్‌పై పలువురు ఓటర్లతో మాటా మంతి
  • సమస్యలు సావధానంగా విన్న కాంగ్రెస్‌ అభ్యర్థి
  • తనను గెలిపిస్తే ఏం చేస్తానో చెప్పిన నేత
గుడ్‌మార్నింగ్‌ వాకర్స్‌...అంటూ తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌, మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఈరోజు ఆకట్టుకున్నారు. ఉదయం నడక సందర్భంగా ఆయన పలువురు ఓటర్లతో ముచ్చటించి తనకు ఓటేయాల్సిందిగా అభ్యర్థించారు. సఫిల్‌గూడ మినీ ట్యాంక్‌ బండ్‌పై వాకింగ్‌ చేసిన రేవంత్‌రెడ్డి కొందరు వాకర్స్‌ను పలకరించారు. వారి ద్వారా నియోజకవర్గం సమస్యలు తెలుసుకున్నారు. వాటిని సావధానంగా విన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తానో వారికి వివరించారు. తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. 
Revanth Reddy
malkajgiri
walkers

More Telugu News