Andhra Pradesh: కర్నూలులో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది!: డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి

  • చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
  • కర్నూలులో వైసీపీ ప్రభావం లేదు
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ నేత
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబే మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాల్లో టీడీపీనే ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలులో వైసీపీ ప్రభావం లేదని స్పష్టం చేశారు. ఈరోజు ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం తథ్యమన్నారు.
Andhra Pradesh
Kurnool District
Telugudesam
KE KRISHNAMOORTHY
Tirumala

More Telugu News