Pawan Kalyan: జనసేనకు గుడ్‌బై చెప్పిన కృష్ణా జిల్లా నేత!
- పామర్రు సీటివ్వాలని ముందే చెప్పా
- కల్పనను గెలిపించేందుకు నాకు సీటివ్వలేదు
- సీటు కేటాయించకపోవడం వెనుక టీడీపీ హస్తం ఉంది
ఈ నెల 18న టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ తాజాగా ఆ పార్టీకి కూడా గుడ్‌బై చెప్పారు. తాను పామర్రు నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ముందే చెప్పానని, కానీ ఆ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించామని, ఆ పార్టీతో మాట్లాడుకోవాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీనియర్‌నన్న గౌరవం కూడా తనకు ఇవ్వట్లేదని వాపోయారు. ఉప్పులేటి కల్పనను గెలిపించేందుకే పవన్ తనకు సీటు ఇవ్వలేదని ఆరోపించారు. తనకు సీటు ఇవ్వకపోవడం వెనుక టీడీపీ హస్తం ఉందని పేర్కొన్నారు. అందుకే తాను జనసేన నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతానికి దాస్ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించలేదు.