Jana sena: అది ‘కోడి కత్తి పార్టీ’ కాదు.. ‘ఒకటిన్నర ఇంచ్ కోడి కత్తి పార్టీ’: వైసీపీపై పవన్ సెటైర్లు

  • టీఆర్ఎస్, బీజేపీతో వైసీపీ కుమ్మక్కయింది 
  • తెలంగాణలో మా పార్టీ లోక్ సభ అభ్యర్థులను నిలబెట్టాం
  • మరి, వైసీపీ ఎందుకు నిలబెట్టలేదు?
వైసీపీపై, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. విజయవాడలోని కోమల్ విలాస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్, బీజేపీతో వైసీపీ కుమ్మక్కయిందని, లేకపోతే, తెలంగాణలో తమ పార్టీ లోక్ సభ అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.

తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టామని, తనకు రాజకీయాలు వేరు, కుటుంబ బంధాలు, స్నేహాలు వేరని స్పష్టం చేశారు. ఈ విషయమై ప్రజలకు జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో వైసీపీ కుమ్మక్కయిందని ఆరోపించారు. వైసీపీ పేరును పవన్ కల్యాణ్ ప్రస్తావించగానే.. జనసేన అభిమానులు ‘కోడికత్తి పార్టీ’ అని నినాదాలు చేయడంతో.. అది కోడికత్తి పార్టీ కాదని, ‘ఒకటిన్నర ఇంచ్ కోడికత్తి పార్టీ’ అని వ్యాఖ్యానించడంతో చప్పట్లు మారుమోగి పోయాయి.
Jana sena
Pawan Kalyan
Vijayawada
YSRCP
jagan
Telugudesam
Jagan
TRS
Kcr
BJp

More Telugu News