Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాయిదా పడిన తమన్నా హారర్ మూవీ

  • 'దేవీ' రీమేక్ గా 'దేవి 2'
  • తమన్నా చేసిన మరో హారర్ మూవీ 
  • పూర్తికాని లావాదేవీలు    
తమన్నా ప్రధాన పాత్రధారిగా 2016లో 'దేవి' తమిళ హారర్ సినిమా విడుదలైంది. ప్రభుదేవా కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, ఏఎల్ విజయ్ దర్శకుడిగా వ్యవహరించాడు. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా, భారీ విజయాలను అందుకుంది. దాంతో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ను సిద్ధం చేశారు.

'దేవి 2' పేరుతో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అదే రోజున తెలుగులో 'అభినేత్రి 2' టైటిల్ తో విడుదలను ప్లాన్ చేశారు. అయితే తెలుగు .. కన్నడ ప్రదర్శన హక్కులకు సంబంధించిన లావాదేవీలు ఇంకా పూర్తికాకపోవడం వలన, విడుదలను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 12వ తేదీన సాయితేజ్ 'చిత్రలహరి' విడుదల కానుంది. 'అభినేత్రి 2' అదే రోజున వస్తుందని టెన్షన్ పడిన 'చిత్రలహరి' టీమ్, సోలో రిలీజ్ దక్కినందుకు ఖుషీ అవుతోందట.
prabhudeva
thamannah

More Telugu News