జనసేనలో చేరతామని వచ్చినవారు.. వైసీపీలో చేరడానికి కారణం ఇదే: పవన్ కల్యాణ్
- వారికి హైదరాబాదులో ఆస్తులు ఉన్నాయి
- అన్నీ గమనిస్తుంటే.. అసలు రాజకీయం అర్థమవుతోంది
- ఎవరికి ఓటు వేయాలో ప్రజలు బేరీజు వేసుకోవాలి
ఓటు వేసే ముందు ప్రజలు అన్ని విషయాలను ఆలోచించాలని... ఎవరి హయాంలో మేలు జరిగింది, ఎవరి హయాంలో అవినీతి, ఘోరాలు జరిగాయో బేరీజు వేసుకోవాలని పవన్ సూచించారు. కోడికత్తి దాడిపై నానా హంగామా చేసిన వైసీపీ అధినేత జగన్... సొంత బాబాయ్ వివేకా హత్యకు గురైతే మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. హత్యారాజకీయాలు చేసేవారు అధికారంలోకి వస్తే... రాష్ట్రం ఏమవుతుందో అనే భయం తనను వెంటాడుతోందని చెప్పారు.