మంగళగిరిలో మంచి మెజార్టీతో లోకేశ్ గెలుస్తాడు: దివ్యవాణి
- ప్రతిపక్ష నాయకుల్లాగా లోకేశ్ భూ కబ్జాలు చేయలేదు
- కావాలంటే, విదేశాల్లోనే ఆయన స్థిరపడొచ్చు
- ప్రజా సేవ చేయాలన్నది లోకేశ్ తాపత్రయం
ప్రతిపక్ష నాయకుల్లాగా లోకేశ్ భూ కబ్జాలు చేయలేదని, ఆయనేమీ నేరస్తుడు కాదని, ఆయన్ని విమర్శించే అర్హత ఎవరికీ లేదని అన్నారు. ఎన్టీఆర్ కు మనవడిగా, బాలకృష్ణకు అల్లుడిగా, సీఎం చంద్రబాబునాయుడి కొడుకుగా లోకేశ్ కూడా ఎన్నో భూ కబ్జాలు చేయొచ్చు, కావాలంటే, విదేశాల్లో స్థిరపడొచ్చు కానీ, ప్రజలకు సేవ చేయాలన్నది ఆయన తాపత్రయం అని చెప్పారు.