lakshminarayana: జేడీ లక్ష్మీనారాయణ బలమైన, సముద్రమంత లోతైన వ్యక్తి: పవన్ కల్యాణ్

  • అత్యున్నత ఉద్యోగాన్ని వదిలేసి ప్రజాజీవితంలోకి వచ్చారు
  • ధైర్యం ఉన్న వాళ్లు పెద్దపెద్ద మాటలు మాట్లాడరు
  • ఒకసారి జైలుకు వెళితే బయటకు రావడానికి పదేళ్లు పడుతుంది
సీబీఐ మాజీ జేడీ, విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఆయన తన పక్కన ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుందని అన్నారు. ఎంతో బలమైన, సముద్రమంత లోతైన వ్యక్తి లక్ష్మీనారాయణ అని అన్నారు.

 2014లో హైదరాబాదులోని బ్రహ్మానందరెడ్డి పార్కులో వాకింగ్ చేసేటప్పుడు లక్ష్మీనారాయణ కనిపించారని... 'సార్, సెక్యూరిటీ కూడా లేకుండా తిరుగున్నారేమిటని' ప్రశ్నించానని... రాజ్యాంగం నాకు ఇచ్చిన విధిని నిర్వహిస్తున్నానని, తనకు భయాలు లేవని ఆయన చెప్పారని తెలిపారు. ధైర్యం ఉన్నవాళ్లు పెద్దపెద్ద మాటలు మాట్లాడరని అన్నారు. తొడలు కొట్టి జైలుకు వెళ్తే, బయటకు రావడానికి పదేళ్లు పడుతుందని చెప్పారు. విశాఖలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పందించారు. అత్యున్నత ఉద్యోగాన్ని వదిలేసి, ప్రజాసమస్యల పరిష్కారం కోసం లక్ష్మీనారాయణ ప్రజాజీవితంలోకి వచ్చారని కితాబిచ్చారు.
lakshminarayana
cbi
janasena
Pawan Kalyan

More Telugu News