jagan: జగన్ జాతకం సీబీఐ, ఈడీ వద్ద ఉంది: పవన్ కల్యాణ్

  • టీడీపీ, వైసీపీలు మంచి నాయకులను పెడితే నేను కూడా మంచి నాయకులను పెడతా
  • రాజకీయాల్లోకి మాస్ లీడర్లను తీసుకొస్తా
  • వైసీపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ప్రచారానికి వస్తున్నారు?
వైసీపీ అధినేత జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జగన్ జాతకం మొత్తం సీబీఐ, ఈడీ వద్ద ఉందని చెప్పారు. విశాఖపట్టణంలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ, టీడీపీ, వైసీపీలు మంచి నాయకులను పెడితే తాను మంచి నాయకులను నిలబెడతానని... విద్యావంతులను నిలబెడితే తాను కూడా విద్యావంతులను నిలబెడతానని చెప్పారు. వారు మంచి నేతలను పెట్టకపోతే... తాను కూడా అలాంటివాళ్లనే నిలబెడతానని అన్నారు. రాజకీయాల్లోకి మాస్ లీడర్లను తీసుకొస్తానని అన్నారు. గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు తనకు బలమైన నాయకులు కావాలని చెప్పారు. పక్క పార్టీలు క్రిమినల్ లీడర్లు మీద పడితే వారిని ఎదుర్కోవడానికి తమకు కూడా మాస్ లీడర్లు కావాలని అన్నారు. వైసీపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ప్రచారానికి వస్తున్నారని పవన్ ప్రశ్నించారు.
jagan
Pawan Kalyan
janasena

More Telugu News