anjali: ఉత్కంఠను రేపుతోన్న అంజలి హారర్ మూవీ టీజర్

  • అంజలి ప్రధాన పాత్రధారిగా 'లిసా'
  • హారర్ నేపథ్యంలో సాగే కథ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు    
తెలుగు .. తమిళభాషల్లో కథానాయికగా అంజలికి మంచి క్రేజ్ వుంది. కథానాయికగా తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే, నాయికా ప్రాధాన్యత గల చిత్రాలను చేస్తూ .. మెప్పిస్తూ వస్తోంది. అలా తాను ప్రధాన పాత్రధారిగా ఆమె 'లిసా' అనే హారర్ మూవీ చేసింది. ఈ 'త్రీడీ' మూవీ నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.

ఒక ఇంట్లో అంజలికి ఎదురయ్యే భయానక సంఘటనలపై కట్ చేసిన ఈ టీజర్, ఈ సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది. హారర్ థ్రిల్లర్ సినిమాలు చేయడం అంజలికి కొత్తేమి కాదు. గతంలో తాను చేసిన ఈ తరహా సినిమాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, బ్రహ్మానందం .. యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది
anjali
brahmanandam
yogibabu

More Telugu News