Telangana: ‘తెలంగాణ జనసమితి’కి గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం!

  • బాక్సు గుర్తును కేటాయించిన ఈసీ
  • అన్న వైఎస్సార్ కాంగ్రెస్ కు బ్యాట్స్ మెన్, ఫుట్ బాల్ ప్లేయర్ గుర్తులు
  • సీపీఐ మార్క్సిస్ట్ కు కంప్యూటర్ గుర్తు ఇచ్చిన ఎన్నికల సంఘం
లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జోరు పెంచింది. ఇందులో భాగంగా 76 పార్టీలకు గుర్తును కేటాయించింది. కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితికి ఈ సందర్భంగా ‘బాక్సు’ గుర్తును కేటాయించింది. అలాగే ‘అన్న వైఎస్సార్ కాంగ్రెస్’ పార్టీకి తెలంగాణలోని 10 స్థానాలకు గానూ బ్యాట్స్ మెన్ గుర్తును ఇచ్చింది.

ఏపీలోని 13 స్థానాలకు ఫుట్ బాల్ ఆటగాడి గుర్తును కేటాయించింది. మరోవైపు భారతీయ రాష్ట్రీయ మోర్చాకు తెలంగాణలోని 16 స్థానాలకు బెంచ్‌ గుర్తు ఇచ్చింది. అలాగే మార్క్సిస్ట్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు తెలంగాణలోని 4 లోక్‌సభ స్థానాలకు కంప్యూటర్‌ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.
Telangana
tjs
Kodandaram
box symbol
election comission

More Telugu News