నంబర్ ప్లేట్లపై నంబర్ మాత్రమే ఉండాలి: అభిమానులకు విజయ్ దేవరకొండ విజ్ఞప్తి

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ లో ఇప్పుడున్న యువ హీరోల్లో విజయ్ దేవరకొండకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అర్జున్ రెడ్డి విజయంతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఏకంగా, తన ఇమేజ్ తో ఓ బ్రాండ్ ను మార్కెట్ చేసే రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ. రౌడీ పేరుతో మార్కెట్లో దర్శనమిస్తున్న కొత్త తరం దుస్తులు యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

కానీ, రౌడీ బ్రాండ్ ను బైక్ నంబర్ ప్లేట్లపైకి కూడా ఎక్కిస్తున్న కొందరు యువకులు అనవసరంగా చిక్కుల్లో పడుతున్నారు. బైక్ నంబర్ ప్లేట్ పై నంబర్ తో పాటు రౌడీ సింబల్ కూడా పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలాంటి బైక్ లను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. ఈ విషయం విజయ్ దేవరకొండ దృష్టికి వెళ్లడంతో విచారం వ్యక్తం చేశాడు. తన అభిమానుల తరఫున తాను క్షమాపణలు తెలుపుకుంటున్నానని తెలిపాడు.

అభిమానులను తాను కుటుంబ సభ్యులుగా భావిస్తానని, దయచేసి నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి కష్టాల్లో పడొద్దని హితవు పలికాడు. మీ ప్రేమను నంబర్ ప్లేట్లపై చూపించాల్సిన అవసరంలేదని, నంబర్ ప్లేట్లను నంబర్ కోసమే ఉపయోగించాలని సూచించాడు.
Go Back to Shorts
Tollywood
Police

More Telugu News