uber: భర్త పక్కనే ఉన్నా.. భార్యతో అసభ్యంగా మాట్లాడిన ఉబెర్ డ్రైవర్

  • ఢిల్లీలో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉబెర్ డ్రైవర్
  • ఉక్కపోతగా ఉంటే నా ఒళ్లో కూర్చో అంటూ వ్యాఖ్య
  • ఢిల్లీ పోలీసులు, ఉబెర్ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు
ఓ మహిళ పట్ల ఉబెర్ క్యాబ్ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు జరిగిన జగుప్సాకర అనుభవాన్ని అమ్రితా అనే మహిళ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

'నా భర్తతో కలసి ఉబెర్ క్యాబ్ ఎక్కాను. తొలుత ఏసీ వేయడానికి ఉబెర్ డ్రైవర్ తిరస్కరించాడు. ఆ తర్వాత ఏసీ వేసినా, చల్లగా లేకపోవడంతో, ఉక్కపోతగా ఉందని చెప్పాను. దీంతో, అంత ఉక్కపోతగా ఉంటే వచ్చి నా ఒళ్లో కూర్చో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సభ్యత లేని ఉబెర్ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను' అంటూ అమ్రితా ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ ను ఆమె ఢిల్లీ పోలీసులు, ఉబెర్ కు ట్యాగ్ చేసింది. తాను ప్రయాణించిన కారు, డ్రైవర్ ఫొటోను కూడా జత చేసింది. ఈ ఘటనపై ఉబెర్ యాజమాన్యం స్పందించింది. జరిగిన ఘటనకు బాధపడుతున్నామని సమాధానమిచ్చింది.
uber
cab
driver
woman
delhi

More Telugu News