Andhra Pradesh: జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతా.. రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తాం!: డీఎల్ రవీంద్రారెడ్డి

  • నేను వైఎస్ కుటుంబంలో సభ్యుడిని
  • ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తా
  • మీడియాతో మాట్లాడిన సీనియర్ నేత
తాను త్వరలోనే వైసీపీలో చేరుతున్నట్లు కడప జిల్లా సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి ప్రకటించారు. చాలాకాలంగా తాను వైఎస్ కుటుంబంలో సభ్యుడిగా ఉన్నానని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తానని డీఎల్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లాలో ఈరోజు వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాశ్ రెడ్డిలతో సమావేశమైన అనంతరం డీఎల్ మీడియాతో మాట్లాడారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని డీఎల్ విమర్శించారు. జగన్ నాయకత్వంలో రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తామని పేర్కొన్నారు.  వైసీపీ అధినేత జగన్ కు అన్నిరకాలుగా అండగా ఉంటామన్నారు. జగన్ సమక్షంలో త్వరలోనే తాను వైసీపీలో చేరతానని స్పష్టం చేశారు. మరోవైపు వైసీపీలో చేరితే జగన్ డీఎల్ రవీంద్రారెడ్డికి ఏ పదవి అప్పగిస్తారన్న విషయం తెలియరాలేదు. 
Andhra Pradesh
Jagan
YSRCP
dl ravindra reddy

More Telugu News