modi: నాకు దేశమే ముఖ్యం.. కుటుంబం కాదు: మోదీ

  • కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు
  • పార్టీ పగ్గాలను చేపట్టాలనుకునేవారిని బయటకు గెంటివేస్తారు
  • రక్షణ శాఖను కూడా ఆదాయ వనరుగా భావించారు
తనకు దేశమే ముఖ్యమని, కుటుంబం కాదని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి కాంగ్రెస్ పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. ఎవరైనా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అధిరోహించాలని భావిస్తే... వారిని నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటకు గెంటి వేస్తారని చెప్పారు. రక్షణ శాఖను ఆదాయ వనరుగా భావించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో జవాన్లకు తగిన గౌరవం కూడా దక్కలేదని అన్నారు. రక్షణ ఒప్పందాలలో మధ్యవర్తిత్వం వహించిన ప్రతి వ్యక్తికి దేశంలోని ఒక కుటుంబం (గాంధీ)తో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ చాపర్ల కుంభకోణం కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీల పేర్లను మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ వెల్లడించినట్టు ఓ కోర్టుకు ఈడీ తెలిపిందని గుర్తు చేశారు.
modi
Sonia Gandhi
Rahul Gandhi
congress
bjp

More Telugu News