cudupha: టీడీపీ నేత డీ.ఎల్‌.రవీంద్రారెడ్డితో వైసీపీ మంతనాలు...పార్టీలో చేరాలని ఆహ్వానం

  • ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం
  • మైదుకూరు టికెట్టు ఆశించిన డీఎల్‌
  • పుట్టా సుధాకర్‌యాదవ్‌కు కేటాయించిన చంద్రబాబు
కడప జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి డి.ఎల్‌.రవీంద్రారెడ్డికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గాలం వేస్తోంది. మైదుకూరు నుంచి టీడీపీ టిక్కెట్టు ఆశించి భంగపడిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఇదే అదనుగా ఆయనను పార్టీలోకి రప్పించేందుకు వైసీపీ నాయకులు మంతనాలు జరిపారు. పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాష్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలు ఈరోజు డీఎల్‌ ఇంటికి వెళ్లి చర్చలు జరిపి, వైసీపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సుదీర్ఘకాలం ఆయన ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. కొద్దినెలల క్రితమే టీడీపీలో చేరారు. టికెట్టు విషయంలో అధిష్ఠానం ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించడం, అదే సమయంలో వైసీపీ నాయకులు రాయబారం నడపడంతో పార్టీ మారేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. శుక్రవారం పార్టీ అధినేత జగన్‌ పులివెందులలో నామినేషన్‌ వేయనున్నారు. ఆ సమయంలో డీఎల్‌  వైసీపీ కండువా కప్పుకోనున్నారని సమాచారం.
cudupha
Telugudesam
YSRCP
DLravindrareddy

More Telugu News