konidela niharika: డేటింగ్ చేయడానికి అలాంటి వ్యక్తిని ఎంచుకుంటా: కొణిదెల నిహారిక

  • నాకు కూడా స్వార్థం ఉంది
  • ప్రేమకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లు నాకు నచ్చవు
  • ఓ సారి రెండు రోజుల పాటు స్నానం చేయలేదు
మెగా హీరోయిన్ కొణిదెల నిహారిక నటించిన 'సూర్యకాంతం' మార్చి 29న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో నిహారికతో పాటు యూనిట్ సభ్యులు బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా '60 సెకండ్స్ విత్ నిహారిక' కార్యక్రమంలో తనకు వచ్చిన పలు ప్రశ్నలకు ఆమె చిలిపి సమాధానాలు ఇచ్చారు.

'సూర్యకాంతంలాగానే నేను కూడా స్వార్థ స్వభావం కలిగిన అమ్మాయిని. ప్రేమకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లు నాకు నచ్చవు. డేటింగ్ చేయాల్సి వస్తే...నా మాటను ఓపికగా వినే వ్యక్తిని ఎంచుకుంటా. ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న సమయంలో ఫసక్ అనే పదాన్ని వాడవచ్చు. గతంలో ఒక సారి రెండు రోజులు స్నానం చేయకుండా ఉన్నా' అంటూ ఆయా ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.
konidela niharika
suryakantham
tollywood

More Telugu News