priya raman: చిరూ .. నాగ్ .. బాలయ్యల సరసన ఛాన్స్ వచ్చిందిగానీ .. చేయలేకపోయాను: సీనియర్ హీరోయిన్ ప్రియా రామన్

  • 'హిట్లర్'లో రంభ పాత్ర నేను చేయవలసింది
  • 'క్రిమినల్'లో హీరోయిన్ కోసం అడిగారు
  •  డేట్స్ కుదరక చేయలేదు           
వివిధ భాషల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియా రామన్, ఇక ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.

"కెరియర్ ఆరంభంలోనే నేను రజనీకాంత్ .. కమల్ హాసన్ వంటి అగ్రకథానాయకులతో కలిసి నటించాను. తెలుగులో చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ వంటి స్టార్ హీరోల సరసన నటించలేకపోయాను. రాఘవేంద్రరావుగారు రెండు .. మూడు సినిమాల నిర్మాణం సమయంలో నాకు కాల్ చేయించారు. కానీ నాకు డేట్స్ కుదరకపోవడం వలన చేయలేకపోయాను.

'హిట్లర్' మూవీలో 'రంభ' చేసిన పాత్రకిగాను ముందుగా నన్ను సంప్రదించారు .. నేనప్పుడు విదేశాల్లో ఉండటం వలన కుదరలేదు. నాగార్జున గారు హీరోగా చేసిన 'క్రిమినల్' సినిమా కోసం కూడా నన్ను అడిగారు .. అది చేయడం కూడా కుదరలేదు. ఇలా అవకాశాలు వచ్చాయిగానీ .. చేయలేకపోయాను" అని చెప్పుకొచ్చారు.
priya raman

More Telugu News